Dailyhunt
తెలంగాణ ప్రభుత్వానికి NGTలో భారీ ఊరట.. మూసీ సుందరీకరణకు లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వానికి NGTలో భారీ ఊరట.. మూసీ సుందరీకరణకు లైన్ క్లియర్

హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)

మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) డిస్మిస్ చేసింది.

దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది.

ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించిన ట్రిబ్యూనల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu