Dailyhunt
తెల్లవారుజామునే తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 31 కంపార్ట్మెంట్లు ఫుల్

తెల్లవారుజామునే తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 31 కంపార్ట్మెంట్లు ఫుల్

తిరుమల, 30 ఏప్రిల్ (హి.స.)

కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala)లో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం సుమారు 12 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్నప్రసాదం, తాగునీరు వంటి సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు తిరుమలలో భక్తుల మొక్కుల కోలాహలం కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. బుధవారం ఒక్కరోజే 72,362 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 29,166 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో ఓపికగా వేచి ఉండాలని భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu