Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు.. కర్నూలులో హైటెన్షన్

టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఆందోళనలు.. కర్నూలులో హైటెన్షన్

కర్నూలు, 14 మే (హి.స.) శ్రీరామ నగర్ 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సునీల్పై వైసీపీ మూకలు కత్తులతో దాడి ఘటనను ఖండిస్తూ టీడీపీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్తో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు దాటే ప్రయత్నం చేస్తుండగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్కు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

మంత్రి టీజీ భరత్ గుప్తాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో వైసీపీ మూకలు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నారని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు. సంబంధం లేని విషయాల్లో మంత్రి పేరు లాగుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్రీ టౌన్ ముందు ధర్నా చేసేందుకు వైసీపీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా, రాష్ట్ర యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సిద్ధమయ్యారు. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య పోటాపోటీ ఆందోళనలతో కలెక్టరేట్ ఎదుట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu