Dailyhunt
తిరుమల అప్డేట్.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమల అప్డేట్.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమల , 05 ఏప్రిల్ (హి.స.)

కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. గత నాలుగు రోజులుగా స్వల్పంగా పెరిగినప్పటికీ..

నేడు వారాంతం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు

ఇదిలా ఉంటే శనివారం ఒక్కరోజే మొత్తం 80,841 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్న వారిలో 33,559 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.45 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu