Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల అప్డేట్స్: పెరుగుతున్న రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల అప్డేట్స్: పెరుగుతున్న రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల , 02 జూలై (హి.స.)కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ (Crowd of devotees) సాధారణ స్థాయిని మంచి పెరుగుతుంది. గురువారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.

దీంతో ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి (Sarvadarsanam) సుమారు 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే, టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు కలిగిన భక్తులకు 4 నుంచి 5 గంటల వ్యవధిలో దర్శనం లభిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే బుధవారం రోజు 78,067 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31,158 మంది స్వామివారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ద్వారా లభించిన నగదు కానుకల ఆదాయం రూ. 4.39 కోట్లు గా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ (TTD) అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందజేస్తూ ప్రత్యేక పర్యవేక్షణ ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu