Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తిరుమల తిరుపతి.దేవస్థానానికి ఓ ఇన్నోవా కారు. విరాళం

తిరుమల ,15 మే (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ ఇన్నోవా కారును విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన పోసన ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ మగేశ్ సుందర్ శుక్రవారం రూ.40 లక్షలు విలువ చేసే టయోటా ఇన్నోవా కారును విరాళంగా అందజేశారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదుట కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి డిప్యూటీ ఈవో లోకనాథంకు కారు తాళాలను అందించారు. ఈ కార్యక్రమంలో తితిదే డీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu