Dailyhunt

తిరుమల తిరుపతి.దేవస్థానం బోర్డుకు సలహాలు.ఇచ్చేలా ప్రత్యేక ఆహ్వానితులు నియామకం

మరావతి, 02 మే (హి.స.)'తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సలహాలు ఇచ్చేలా ప్రత్యేక ఆహ్వానితులుగా అనేక మందిని నియమిస్తున్నారు. ఇందుకోసం 2023లో చట్టాన్ని మార్పు చేశారు.

సవరించిన చట్టాన్ని రద్దు చేయాలి. పాలనాపరమైన, నిర్మాణాత్మక, వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి' అని విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్కుమార్ కమిషన్ సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులివీ..

నెయ్యి కల్తీ వ్యవహారంలో తితిదే బోర్డు పర్యవేక్షణ, పాలన తీరు ఆందోళన కలిగించింది. బోర్డులో నిర్మాణాత్మక మార్పులు చేయాలి. అసలు చట్టం 1987లోని 30 విభాగం సెక్షన్ 97కు 2023లో మార్పులు చేసి.. సుమారు 55 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తున్నారు. ఈ నియామకాలకు అవకాశం కల్పించే 2023 చట్టం 1లోని సెక్షన్ 97 (సి), 97 (డి)లను శాశ్వతంగా రద్దు చేయాలి.

బోర్డు నిర్ణయాలు సవ్యంగా అమలయ్యేలా మేనేజ్మెంట్ కమిటీ అవసరం. దశల వారీగా నిర్ణయాలు అమల్లోకి తేవాలి. పాలనాపరమైన ఆదేశాలు జారీ చేయాలి. సమన్వయ లోపాలను నిరోధించగలగాలి. వీటిలో అడ్డంకులను మేనేజ్మెంట్ కమిటీ పరిష్కరించాలి.

తాజా ఘటనల్లో విజిలెన్స్ విభాగం లోపం స్పష్టమైంది. మోసాలు, లోపాలు ఎక్కడున్నా గుర్తించేలా ఆ విభాగం ఉండాలి. ఈ నివేదికలోని అంశాలను పరిశీలించి సదరు విభాగం తమ విధులను పునఃసమీక్షించుకోవాలి. పర్యవేక్షణ మెరుగుపరుచుకునేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

తితిదేలో నెయ్యితో సహా అన్ని ఆహార పదార్థాలకు కచ్చితమైన ప్రయోగశాల పరీక్షలు అవసరం. నేరుగా ఈవో, జేఈవోలకు నివేదిక ఇచ్చేలా నాణ్యత నియంత్రణ విభాగం అందుబాటులో ఉండాలి. క్రమం తప్పకుండా ల్యాబ్లలో పరీక్షించాలి (ఎలా పరీక్షలు చేయాలో కూడా నివేదిక తెలియజేసింది

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu