Dailyhunt
తిరుమలలో భక్తుల రద్ధీ.. 15 గంటలకు చేరిన సర్వదర్శన సమయం

తిరుమలలో భక్తుల రద్ధీ.. 15 గంటలకు చేరిన సర్వదర్శన సమయం

తిరుమల, 04 ఏప్రిల్ (హి.స.)

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరిగిపోతుంది. వరుస సెలవులు, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తల్లిదండ్రులు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు.

దీంతో శనివారం తెల్లవారు జామున తిరుమల వీధులన్ని బక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, వెలుపల ఉన్న క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అన్నప్రసాదం, తాగునీరు వంటి సౌకర్యాలను క్యూలైన్లలో నిరంతరాయంగా అందజేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu