Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తిరుపతి.జిల్లా.రైల్వే కోడూరు.మండలం బాలపల్లె చెక్ పోస్ట్ వద్ద రెండు.కార్లు దగ్దం

తిరుపతి, 20 మే (హి.స.)

చెక్పోస్టు వద్ద ఉన్న లారీని ఒక కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో కడప నుంచి తిరుపతి వెళ్తున్న మరో కారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆగింది.

ఆగిన కారులోంచి అనుహ్యంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ప్రమాదానికి గురైన కారుకు అంటుకున్నాయి. దాంతో రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. బైక్ తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలోని బాలపల్లె చెక్పోస్టు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన కారులో ఉన్న డ్రైవర్ అందులో నుంచి దూకేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో లారీ వెనకభాగం పాక్షికంగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu