Dailyhunt
త్వరగా ఇరాన్ వదిలి వెళ్లిపోండి : భారత్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ

త్వరగా ఇరాన్ వదిలి వెళ్లిపోండి : భారత్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ

ఢిల్లీ , 08 ఏప్రిల్ (హి.స.)

ఇరాన్పై అమెరికా చేపట్టిన 'ఆపరేషన్

రాయబార ఎపిక్ ఫ్యూరీ' కి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాటు విరామం ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం(Indian Embassy Advisory) కీలక అడ్వైజరీ జారీ చేసింది.

అక్కడ ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని (Expeditiously) సూచించింది. పౌరులంతా ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సూచించిన సురక్షిత మార్గాల్లోనే తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదని ఎంబసీ గట్టిగా హెచ్చరించింది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి కదలిక ఎంబసీ సమన్వయంతోనే జరగాలని, అప్పుడే భద్రతకు గ్యారంటీ ఉంటుందని స్పష్టం చేశారు. భారతీయుల సహాయార్థం ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. సహాయం కావలసినవారు +98 9128109115, +98 9128109102, +98 9128109109, +98 9932179359 అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu