Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు.. మంత్రి పొంగులేటి

త్వరలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు.. మంత్రి పొంగులేటి

ఖమ్మం, 21 మే (హి.స.)

ప్రతి అర్హులైన పేద కుటుంబానికి

ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గురువారం సత్తుపల్లి పట్టణంలో గురువారం సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలా లకు సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణం, అటవీ భూముల సమస్యల అంశాలపై నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గురుకులాల్లో డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీల పెంపు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా, సంక్షేమాన్ని ఆపకుండా రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 72 వేల ఉద్యోగాలు కల్పించామని, త్వరలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu