Dailyhunt

త్వరలో పెళ్లి... యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతి

. గుంటూ రు 04 ఏప్రిల్ (హి.స.), : త్వరలో పెళ్లి చేసుకోబోయే యువ జంట రోడ్డుప్రమాదంలో మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని ఓబులేశునపల్లె సమీపంలో చోటుచేసుకుంది.

గుంటూ రులోని గోరంట్ల రోడ్డు సమీపంలోని వినాన్మార్టుకు చెందిన సందీప్కుమార్ (21)కు సోఫియా (20)తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఇద్దరూ ద్విచక్రవాహనంపై గు డ్ఫ్రైడే సందర్భంగా నాగార్జునసాగర్లోని సాగరమాత ఆలయానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వేగంగా వెళుతూ ముందుగా వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. తీవ్రగాయాలైన వారిని 108లో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. త్వరలో వివాహంతో ఒకటి కాబోయే జంట ఆకస్మిక మరణంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu