Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చే ఏడాది నిర్వహించే .గోదావరి.పుష్కరాల పై. మంత్రి నారాయణ సమీక్ష

వచ్చే ఏడాది నిర్వహించే .గోదావరి.పుష్కరాల పై. మంత్రి నారాయణ సమీక్ష

రాజమహేంద్రవరం:, 04 జూలై (హి.స.)

వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు.

గోదావరి పుష్కరాల కోసం సీఎం చంద్రబాబు రూ.1500 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వీటిలో కేవలం రాజమహేంద్రవరంలో పుష్కరాల కోసమే రూ.580 కోట్ల పనులకు సీఎం అనుమతించారని చెప్పారు.

''పుష్కరాలకు రాజమహేంద్రవరంలో కల్పించాల్సిన సదుపాయాలపై చర్చించాం. పనులు వెంటనే ప్రారంభించాలన్న సీఎం ఆదేశాల మేరకు చేపట్టాల్సిన పనులు నిర్ణయించాం. ప్రస్తుత నిధులతో తొలిదశ పనులు ప్రారంభిస్తున్నాం. రాజమహేంద్రవరంలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తాం. గోదావరిలో మురుగు నీరు కలవకుండా చర్యలు తీసుకుంటాం. రాజమహేంద్రవరంలో డ్రైనేజీ కాల్వల నిర్మాణం కోసం రూ.140కోట్లతో పనులు ప్రారంభిస్తాం.. రోడ్ల నిర్మాణం, విస్తరణ, లైటింగ్ పనులు చేపడతాం. టీడీఆర్ బాండ్లు జారీ చేసి, నగరంలో రోడ్ల విస్తరణ త్వరలో చేపడతాం. గోదావరి కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నిధులు కేటాయిస్తాం. ఘాట్ల ఆధునికీకరణ, విస్తరణను ఇరిగేషన్ శాఖ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తాం'' అని నారాయణ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu