Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా : కేటీఆర్

హైదరాబాద్, 03 జూన్ (హి.స.)

నేను గతంలో చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ.. వచ్చే ఏడాది పాదయాత్ర ఎప్పుడుంటుందనేది పార్టీ నిర్ణయిస్తుంది. కానీ 2027 మాత్రం ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి పాదయాత్ర చేయాలి.. ఏ సమయంలో చేయాలనేదానితో పాటు మిగతా విషయాలు పార్టీలో మిగితా పెద్దలందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.మా గుర్తు కారు మాకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మాస్థాయి చాలు రేవంత్ రెడ్డికి. కేసీఆర్ ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయనెప్పుడు రావాలో.. ఎలా రావాలో..ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు.. ఆయన టైంకు వస్తారు. ఆయన ఓజీ ఆఫ్ తెలంగాణ.. ఓజీ అన్పప్పుడు ఓజీ ఓజీలాగానే ఉండాలన్నారు కేటీఆర్.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu