Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ దొంగ నిరసనలపై కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఫైర్!

వైసీపీ దొంగ నిరసనలపై కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఫైర్!

కదిరి, 20 మే (హి.స.)

: పెట్రోల్ డీజిల్ ధరల పెంపు పై వైఎస్సార్ సీపీ చేస్తున్న నిరసనలపై మండిపడ్డారు సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించడం కోసమే వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో యావత్ ప్రపంచ దేశాలన్నీ చమురు కొరతతో కొట్టుమిట్టాడుతుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ధరలు పెరిగాయని నిరసనలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన దాష్టీకాలన్నింటినీ మళ్ళీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సమర్థించుకుంటూ, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలోనే ఇంధన ధరల పెరుగుదల అత్యంత కనిష్టంగా ఉందని ,గతంలో చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగినప్పుడు, దాదాపు 76 రోజుల పాటు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఆ భారాన్ని భరించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయని గుర్తుచేసింది అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu