Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వైసిపి నేత.బై రెడ్డి.సిద్ధార్థ.రెడ్డి.పై కేసు.నమోదు

కర్నూలు:, 20 మే (హి.స.)

వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు త్రీ టౌన్ సీఐ శేషయ్య వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఫిర్యాదు మేరకు సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.

మే 14వ తేదీన కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ గుప్తాపై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సిద్దార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు, పరువుకు భంగం కలిగించడంతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో మంత్రి భరత్ గుప్తా స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu