Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరి గడ్డి కి భలే గిరాకి

వరి గడ్డి కి భలే గిరాకి

ఆత్మకూరు (అనంతపురం), 14 మే (హి.స.)ఎండుగడ్డే కదా అని వది లేసే రోజులు పోయాయి. ఒకప్పుడు మాసూళ్లు అయిన తరువాత వరి చేలల్లోనే గడ్డి వదిలేసేవారు. లేదంటే పాడి రైతులకు ఉచితంగా ఇచ్చేవారు.

ఇప్పుడు గడ్డే బంగారమైంది. ఎక్కడా ఎండు గడ్డి దొరికే పరిస్థితి లేదు. రైతులను బతిమలాడి మరీ అధిక ధర చెల్లించి కొనాల్సి వస్తోంది.రైతుకు తిండి గింజలు దక్కకపోయినా పాడి పశువులకు రైతుల అధిక ధర చెల్లించి ఎండుగడ్డి కొనుగోలు చేసు కుంటున్నారు.

ఆత్మకూరు మండలంలో బియలేరు మాదిగుబ్బ మాగాణి కింద సాగు చేస్తున్నారు. మొక్కజొన్న పంటను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నడంతో పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. కొందరు ట్రాక్టర్ యజమానులు,కణేకల్ మాగాణి కింద వరిగడ్డిని కొనుగోలు చేసి గ్రామాల్లోనికి తెచ్చి ట్రాక్టర్ రూ 15 వేలకు అమ్ముతున్నారు. దీంతో పశువుల యజమానులు పశుగ్రాసం కోసం అధిక రేటు పెట్టి వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు.

అధిక విస్తీర్ణంలో వరిని సాగు చేసే సమయంలో రైతులు వరిగడ్డిని ఉచితంగా ఇచ్చేవారు. వరి సాగు తక్కువగా ఉండడంతో వరిగడ్డికి గిరాకీ ఏర్పడడంతో రైతులు ఎకరా వరిగడ్డిని రూ 2500 లకు అమ్ముతున్నారు. ట్రాక్టర్ కు ఎకరాన్నర నుండి రెండు ఎకరాల గడ్డి పడుతుంది. వరిగడ్డికి మంచి డిమాండ్ ఏర్పడిందని రైతులు తెలుపుతున్నారు. ట్రాక్టరు బాడుగ కూలీ ఖర్చులతో ట్రాక్టర్ వరిగడ్డి 13 వేల నుండి 15 వేలకు ధర పలుకుతుందని రైతులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu