
వరంగల్, 01 జూన్ (హి.స.)
పోలీసులు విధి నిర్వహణలో రాణించే సిబ్బంది శాఖపరమైన గుర్తింపుతో పాటు రివార్డులు వస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది శాఖపరమైన సమస్యలపై పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమములో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు నీజాయితోతో పనిచేయాలని, శిక్షణ సమయంలో నేర్చుకున్నదే కోనసాగించాలన్నారు. ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులని, మనం చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తారన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందన్నారు పోలీసులు తప్పు చేసిన, చేయకున్న సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందన్నారు. ఇది దృష్టిలో వుంచుకోని ప్రతి పోలీస్ అధికారి జాగ్రత్తగా పనిచేయాలన్నారు. నిరంతరం కష్టపడి విధులు నిర్వర్తించాలన్నారు. అన్నారు. వరంగల్ కమిషనరేట్
విశ్రాంతి గదులుతో పాటు...
ప్రజల్లో పోలీసుల పట్ల తప్పుడు సంకేతాలు పోతాయన్నారు. మీకు ఎదైన శాఖపరమైన లేక వ్యక్తిగత సమస్యలు ఉంటే తన దృష్టి రావాలన్నారు. వీలైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతం ఖైదీల ఎస్కాట్, ఇంక్రీమెంట్లు, విశ్రాంతి గదులుతో పాటు పలు శాఖపరమైన సమస్యలు పోలీస్ సిబ్బంది పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

