Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలి.. మిర్యాలగూడ బిజెపి

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలి.. మిర్యాలగూడ బిజెపి

మిర్యాలగూడ, 05 ఆగస్టు (హి.స.)

మిర్యాలగూడ ప్రాంతీయ వైద్యశాలలో డాక్టర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొవాలని పట్టణ బిజెపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్కు బుధవారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రులను ప్రైవేటు అంబులెన్స్ లను ఎంకరేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వన్ టౌన్ అధ్యక్షులు బంటు గిరి, ప్రధాన కార్యదర్శి కొంగర వెంకటరమణ, మూలా రాజిరెడ్డి, సీనియర్ నాయకులు బంటు సైదులు, రేపల పురుషోత్తం రెడ్డి, చిలుకూరి శ్యామ్, చిల్లంచర్ల అభి, కంచుకోముల వేణు, నక్క రవి, చిలుకూరి వెంకటేశ్వర్లు, మొదాల అశోక్, మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనె కవిత, బంటు శివ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu