Dailyhunt
వీహెచ్ సంచలన నిర్ణయం.. ఈ నెల 9 నుంచి ఆమరణ నిరాహార దీక్ష

వీహెచ్ సంచలన నిర్ణయం.. ఈ నెల 9 నుంచి ఆమరణ నిరాహార దీక్ష

హైదరాబాద్, 05 మే (హి.స.)

బీసీ క్యాస్ట్ సెన్సెస్ పై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ నెల 9 వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నట్లు ప్రభుత్వ సలహాదారు, వి.హనుమంత్ రావు తెలిపారు.

బీసీ క్యాస్ట్ సెన్సెస్పై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ దీక్ష కొనసాగుతుందన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన 8వ తేదీ లోపు ఈ అంశంపై స్పష్టత ఇచ్చాకే 10వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రావాలన్నారు. ఓసీ అయిన రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేశారని మరి బీసీ అని చెప్పుకునే మోడీ బీసీలపై వివక్ష చూపించడం ఎందుకు అని ప్రశ్నించారు. మోడీ హయాంలో రేట్లు పెరిగి అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu