Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు

విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు

చెన్నై, 17 మే (హి.స.)

తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ గెలిచారని స్టార్ హీరో రజినీకాంత్ అన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.

తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.

మరోవైపు విజయ్ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్ చెప్పారు. విజయ్ను తనకు సమవుజ్జీగా భావించడం లేదన్నారు. తమ వయసులో 28 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతాను గానీ, విజయ్ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు. రెండు ప్రధాన పార్టీలను ఢీకొని గెలిచిన విజయ్కు తాను శుభాకాంక్షలు తెలిపానని గుర్తుచేశారు.

ఇటీవల ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి విజయ్ గురించి ప్రస్తావించగా రజినీకాంత్ నవ్వుతూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడాన్నీ రజినీ తాజాగా ప్రస్తావించారు. ఎవరో వ్యక్తి ఫోన్లో రికార్డు చేస్తూ అడిగిన ప్రశ్నకు తాను స్పందించలేదన్నారు. తాను అనవసరంగా ఇతర విషయాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu