Dailyhunt
విజయవాడలో పోలీసుల విస్తృత తనిఖీలు : కారులో రూ.2 కోట్ల నగదు స్వాధీనం

విజయవాడలో పోలీసుల విస్తృత తనిఖీలు : కారులో రూ.2 కోట్ల నగదు స్వాధీనం

విజయవాడ, 08 ఏప్రిల్ (హి.స.)

విజయవాడ అంబాపురం బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కారులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి విజయవాడకు ఈ నగదును తరలిస్తున్నట్లుగా గుర్తించారు.

కారులో ఉన్న వ్యక్తులు ఆ నగదుకు సంబంధించి సరైన ధృవీకరణ పత్రాలు చూపకపోవడంతో అది హవాలా సొమ్ము అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్న సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu