Dailyhunt
విజయవంతంగాఆర్టెమిస్ 2 ప్రయోగం

విజయవంతంగాఆర్టెమిస్ 2 ప్రయోగం

Hindusthan Samachar 0 months ago

ఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స

అంతరిక్ష

పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆర్టెమిస్-2' మిషన్ విజయవంతంగా ప్రారంభమైంది.

ఫ్లోరిడాలోని కెనడీ

అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్ 39B నుండి బుధవారం

రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అత్యంత శక్తివంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ ద్వారా ఓరియన్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది.

దాదాపు 53 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మానవుడు తిరిగి చంద్రుడి

సమీపానికి వెళ్తున్న తొలి సిబ్బంది సహిత ప్రయోగం ఇదే కావడంతో ప్రపంచవ్యాప్తంగా

దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గతంలో చేపట్టిన అపోలో మిషన్ల తర్వాత మనుషులు భూమి యొక్క

దిగువ కక్ష్యను దాటి ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక యాత్రలోరీడ్ వైస్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్,

జెరెమీ హాన్సెన్ అనే నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు.

ఈ మిషన్ ద్వారా చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి

మహిళగా క్రిస్టినా కోచ్, తొలి నల్లజాతీయుడిగా విక్టర్ గ్లోవర్, మరియు అమెరికేతర వ్యక్తిగా జెరెమీ హాన్సెన్ సరికొత్త చరిత్ర

సృష్టించనున్నారు.

ఈ ఆర్టెమిస్-2 మిషన్ సుమారు 10 రోజుల పాటు కొనసాగనుంది. రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత

ఓరియన్ వ్యోమనౌక వ్యోమగాములను తీసుకుని చంద్రుడి చుట్టూ ప్రయాణించి తిరిగి

సురక్షితంగా భూమికి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఓరియన్ నౌకలోని లైఫ్ సపోర్ట్

సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, వ్యోమగాములకు

ఎదురయ్యే సవాళ్లు ఏమిటి అనే అంశాలను నాసా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా

పరిశీలిస్తారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తదుపరి చేపట్టబోయే 'ఆర్టెమిస్-3' మిషన్కు మార్గం

సుగమమైంది. ఆర్టెమిస్-3 ద్వారా మానవులను నేరుగా చంద్రుడి ఉపరితలంపై (దక్షిణ

ధ్రువం వద్ద) దించాలని నాసా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది విజయవంతమైతే

భవిష్యత్తులో అంగారక (గ్రహయాత్రలకు చంద్రుడే తొలి వేదిక కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu