Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

విశాఖలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్ లో. ఇద్దరు మహిళల . చేతివాటం

విశాఖపట్నం, 17 మే (హి.స.)

, విశాఖలోని ప్రధాన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇద్దరు మహిళలు చేతివాటం ప్రదర్శించారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు.

కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకున్నారు. బాధితురాలు కాకినాడ వెళ్లే బస్సు ఎక్కుతున్న సమయంలో నిందితులైన ఇద్దరు మహిళలు కూడా ప్రయాణికుల్లా నటిస్తూ ఆమె వెనుక చేరారు. బస్సు ఎక్కే క్రమంలో నెట్టుకుంటూ వెళ్తున్నట్లు నటిస్తూ, అత్యంత చాకచక్యంగా బాధితురాలి బ్యాగు జిప్ తీసి, అందులో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు.

నగలు చేతికి చిక్కగానే వారిద్దరూ అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. కొంతసమయం తర్వాత బ్యాగు తెరిచి చూసుకున్న బాధితురాలు.. అందులో నగలు లేకపోవడంతో షాక్కు గురైంది. వెంటనే ఆర్టీసీ కాంప్లెక్స్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి కాంప్లెక్స్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఇద్దరు మహిళలు ప్రయాణికురాలి బ్యాగులోంచి నగలు దొంగిలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పరారీలో ఉన్న మహిళా దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu