వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 రోజుల్లో 17,48,262 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అత్యధికంగా ఈనెల 16న 91వేల మంది దర్శించుకున్నట్లు చెప్పింది.
అలాగే, 3 రోజుల పాటు 90 వేల సంఖ్య దాటగా, 8 సార్లు 80 వేల భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొంది. 22 రోజులకు గానూ హుండీ ఆదాయం రూ.82.96 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

