బీట్రూట్లో ఉండే నైట్రేట్లు రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేసి హిమోగ్లోబిన్ను పెంచుతుంది.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ కాంతిని పెంచి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది

