HNK: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం నిర్వహించిన దుర్గామాత విజయోత్సవ శోభాయాత్రలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, భజనలు, జై దుర్గామాత నినాదాలతో శోభాయాత్ర వైభవంగా సాగింది.
ఆలయం నుంచి పద్మాక్షి కొలను వరకు కొనసాగిన యాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

