TG: భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ అండ్ టీ కార్యాలయంలో మంటలు ఎగసిపడుతున్నాయి. మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కార్యాలయం దగ్గర పంటవ్యర్థాలకు రైతులు నిప్పుపెట్టగా ఎల్ అండ్ టీ కార్యాలయానికి మంటలు వ్యాపించాయి.

