TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ బీజేపీ నేత దీపక్రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11:30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
పంజాగుట్టలో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని కోరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా దీపక్ రెడ్డి వాంగ్మూలన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నారు.

