SRD: కోహిర్ రైల్వే ట్రాక్ సమీపంలో ప్రమాదవశాత్తు స్కూటీపై నుంచి పడి కల్పన (32) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తండ్రితో కలిసి వెళ్తుండగా ఆమె చీర స్కూటీ చక్రంలో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
తలకు బలమైన గాయం కావడంతో బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కంకోల్ 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

