AKP: కర్రల లోడుతో కోటవురట్ల మండలం కె. వెంకటాపురం నుంచి సోమవారం వస్తున్న ట్రాక్టర్ లింగాపురం జంక్షన్లో అదుపుతప్పి బోల్తా పడింది. కర్రల తగలడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి.
తెగిపడిన విద్యుత్ వైర్లకు కరెంట్ సరఫరా అవుతుండడంతో ట్రాన్స్ కో సిబ్బంది వెంటనే స్పందించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

