SDPT: మార్కు క్ మండల పరిధిలోని కర్కపట్ల గ్రామంలో బుధవారం ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం సమయంలో గ్రామంలోని ఒక కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది.
మరోవైపు కురిసిన భారీ వర్షానికి గ్రామ వీధులన్నీ జలమయమై, వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. హఠాత్ పరిణామంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

