SRPT: కోదాడ పట్టణంలో ఓ స్థిరాస్తి వ్యాపారి తమను మోసం చేశాడంటూ సుమారు 60 మంది రైతులు ఆందోళనకు దిగారు. రైతుల నుంచి సుమారు రూ.11 కోట్లు వడ్డీకి తీసుకుని, ఏడాది వరకు డబ్బులు ఇవ్వలేనంటూ నోటీసులు జారీ చేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో వ్యాపారి ఇంటి ముందు టెంట్ వేసి రైతులు ధర్నా చేపట్టారు.

