మిల్కీ మిస్త్ డెయిరీ ఫుడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో అదరగొట్టాయి. ఈ కంపెనీ షేర్లు లాభాల్లో లిస్టయ్యాయి. దీని ఇష్యూ ధర రూ.140 కాగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE)లో రూ.165 వద్ద ఘనంగా లిస్టయ్యాయి.
దీంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూనే ఇన్వెస్టర్లకు ఆరంభంలోనే 18 శాతం లాభాలను(ప్రీమియం) అందించాయి. ఈ అద్భుతమైన లిస్టింగ్తో మదుపర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

