AP: శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నంద్యాలలోని ఆయన నివాసంలో నిన్నటి నుంచే భారీగా పోలీసు బలగాలను మోహరించి, బయటకు రాకుండా అడ్డుకున్నారు.
వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాజకీయ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

