నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు నగదు చెల్లించి టికెట్లను పొందవచ్చు.

