SRCL: తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామ శివారులో గురువారం ఆర్టీసీ డీలక్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. నేరెళ్ల మూల మలుపు వద్ద బస్సు కారును ఓవర్టేక్ చేస్తుండగా, సిద్దిపేట వైపు సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీ మరో వ్యాన్ను ఢీకొట్టింది.
అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే వాహనాన్ని నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.

