రామ్చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా ప్రీమియర్ల సందడి ఈరోజు రాత్రి ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మూవీ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తూ హీరో వరుణ్తేజ్, నటి సమంత, దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టులు పెట్టారు.

