SS: పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను మంత్రి సవిత కోరారు.
గురువారం విజయవాడ సచివాలయంలో ఆయనను కలిసి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను వివరించారు. పెనుకొండలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు.

