E.G: సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గ్రామంలోని పొగాకు ఉత్పత్తి కేంద్రానికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం, పొగాకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

