పార్వతీపురం డివిజన్ పరిధిలోని పెద్దతోలుమండ, కుంచికోట, పెదతాడివలస, రావాడ, రామభద్రపురం గ్రామాల్లో జీసీసీ మేనేజర్ ఎం. సాంబశివరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తదితర నిత్యావసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా అని పరిశీలించారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

