అతి వేగంగా భోజనం చేయడం వల్ల నమిలే సమయం తగ్గి జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తికి కారణమవుతుంది. నమలకుండా మింగడం వల్ల పొట్ట త్వరగా నిండినట్లు మెదడుకు సంకేతాలు అందక అధికంగా తింటారు.
దీనివల్ల బరువు, మధుమేహం పెరుగుతాయి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగై శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి.

