NTR: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దొంగలు బీభత్సం సృష్టించారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని ఆసరాగా చేసుకొని, గుర్తుతెలియని వ్యక్తులు పలువురు అభిమానుల మొబైల్ ఫోన్లు, పర్సులు కాజేశారు.
వేడుక ముగిసిన తర్వాత తమ వస్తువులు పోయాయని గుర్తించిన బాధితులు స్టేడియం పరిసరాల్లో ఆందోళనకు వ్యక్తం చేశారు.

