SKLM: టెక్కలి టౌన్లో తాగునీటి ఇబ్బందులు లేవని, సోషల్ మీడియా ప్రచారం అపోహేనని ఈవో ఎం.శ్రీనివాసరావు సోమవారం స్పష్టం చేశారు. రోజూ 7 ట్యాంకులకు 10.30 లక్షల లీటర్లు పంపింగ్ చేసి ఉదయం 3 గంటలు సరఫరా చేస్తున్నామని, వ్యక్తికి 75-100 లీటర్లు అందుతోందన్నారు.
నీటి కష్టాలపై ఫిర్యాదులు లేవని, మంత్రి అచ్చెన్నాయుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

