Achanta: 100 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి ఎంపీడీఓ
ఆచంట: స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ బి కృష్ణ మోహన్ సోమవారం పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపిడిఓ బి కృష్ణ మోహన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని 50 పోలింగ్ బూత్ ల పరిధిలో ఓటర్ల మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తి అయ్యేలా పంచాయతీ కార్యదర్శులు సహకరించాలన్నారు బూత్ లెవెల్ అధికారులకు ఇతర సిబ్బందిని సహాయకులుగా ఇవ్వాలన్నారు.
సమాచార హక్కు దరఖాస్తులకు సకాలంలో సమాధానాలు పంపాలని, ఇంటి ఇంటికి చెత్త సేకరణ, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా పై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ బి కృష్ణ మోహన్, డిప్యూటీ ఎంపిడిఓ లు సూరన్న, కృష్ణవేణి కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

