Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Adilabad: ఆదిలాబాద్ చరిత్రలోనే తొలిసారి.. పోలీసుల సమ్మర్ క్యాంప్!

Adilabad: ఆదిలాబాద్ చరిత్రలోనే తొలిసారి.. పోలీసుల సమ్మర్ క్యాంప్!

hmtv 1 week ago

Adilabad: ఆదిలాబాద్ చరిత్రలోనే తొలిసారి.. పోలీసుల సమ్మర్ క్యాంప్!

ఆదిలాబాద్: చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు హెడ్ క్వార్టర్స్ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ట్రాఫిక్ పార్కులో ప్రత్యేక ట్రాఫిక్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై దేవేందర్ చిన్నారులకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ గుర్తులు, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ క్రమశిక్షణ, జీబ్రా క్రాసింగ్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాముఖ్యత, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన నియమాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం ద్వారా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu