Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Adilabad: ఆదిలాబాద్‌లో అక్రమ ఫ్లెక్సీల కలకలం 18 మందిపై పోలీసుల కేసు!

Adilabad: ఆదిలాబాద్‌లో అక్రమ ఫ్లెక్సీల కలకలం 18 మందిపై పోలీసుల కేసు!

hmtv 3 weeks ago

Adilabad: ఆదిలాబాద్‌లో అక్రమ ఫ్లెక్సీల కలకలం 18 మందిపై పోలీసుల కేసు!

ఆదిలాబాద్: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ జారీ చేసిన నిబంధనలను అతిక్రమించి ఆదిలాబాద్ పట్టణంలోని జగ్జీవన్ చౌక్ ప్రధాన కూడలి వద్ద అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన 18 మందిపై ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.

జీవన్ రెడ్డి తెలిపారు.

ఈ కేసులో నిందితులుగా రాజు, రోహిత్ షిండే, మహంకాళి అజయ్, యానం నర్సింగరావు, ఫిరంగి మల్లేష్, సోమ ప్రశాంత్, భూపేందర్, రాజు, శ్రీకాంత్ రెడ్డి, సురేందర్, నరేష్, శరత్, గణేష్, శ్రీను, ఇంతియాజ్‌లతో పాటు ఫ్లెక్సీలను తయారు చేసి ఏర్పాటు చేసిన వాసవి ఫ్లెక్స్ యజమాని నాగరాజ్, ఎస్‌ఆర్‌డీ ఫ్లెక్స్ యజమాని, సునీల్ ఫ్లెక్స్ యజమాని సునీల్‌లపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ ఫ్లెక్సీ ల వల్ల ప్రమాదాలు సంభవిస్తే ప్రమాదాలకు సంబంధించిన కేసులలో సైతం వీరిని నిందితులుగా ఉంచబడుతుందని తెలిపారు. ప్రధాన కూడళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు విజిబిలిటీ తగ్గి ట్రాఫిక్ సంకేతాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు.

అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారితో పాటు వాటిని తయారు చేసి ఏర్పాటు చేసే ఫ్లెక్స్ షాపు యజమానులపైనా చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu