Adilabad: బేల మండలంలో ఘోర విషాదం.. పెన్‌గంగా వాగులో మునిగి బాలుడు
ఆదిలాబాద్: బేల మండలం సాంగిడి వద్ద గల పెన్ గంగా వాగులో నీట మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
బేలకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పెన్గంగా వద్ద బోనాలు సమర్పించడానికి వెళ్ళాడు. ఇదే సమయంలో అతని కుమారుడు సాయిదీప్ నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.

