Adilabad: హైవేపై కారులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సేఫ్
Adilabad: ఇచ్చోడ జాతీయ రహదారిపై మంగళవారం కారు అగ్నికి ఆహుతైంది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన స్థానికులు కారులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

