Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Adilabad: జొన్న రైతులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదిరిపోయే గుడ్ న్యూస్!

Adilabad: జొన్న రైతులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదిరిపోయే గుడ్ న్యూస్!

hmtv 1 week ago

Adilabad: జొన్న రైతులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదిరిపోయే గుడ్ న్యూస్!

Adilabad: రైతులు పండించినటువంటి జొన్న పంటను వారి వద్ద నుండి త్వరగా కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాలను పెంచడం జరుగుతుందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

రైతులు పండించినటువంటి జొన్న పంటను వారి వద్ద నుండి త్వరగా కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాలను పెంచడం జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం బోరజ్ మండలం పిప్పర్ వాడాలో ఏర్పాటుచేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయ పనులు చేసుకోవడానికి కొన్ని రోజులైనా నేపథ్యంలో గ్రామాల్లో సైతం జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు సోదరులు షెడ్యూల్ ప్రకారం తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.

కొనుగోలు మధ్యతరం ఆగిపోతుందని రైతులు ఆందోళన చెందవద్దని.. పూర్తి పంటలు కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు. కొనుగోలు విషయంలో అనవసరమైన రాజకీయాలు మానుకోవాలని హితోవు పలికారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, తాహసిల్దార్ రాజేశ్వరి ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu